Adani Share Manipulation : ఎల్లుండి ఈడీ ఆఫీస్ ల ముందు కాంగ్రెస్ ధర్నా

పారిశ్రామిక వేత్త అదానీ సెబీతో కుమ్మక్కై షేర్లను కృత్రిమంగా పెంచుకోవడంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) తో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 22 న నిరసన ర్యాలీతో పాటు ఈడీ కార్యాలయం ముందు బైఠాయింపు కార్యక్రమం నిర్వహించనున్నట్లు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బి మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా పాల్గొంటారని చెప్పారు. సోమవారం గాంధీభవన్లో ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు.
గురువారం గన్ పార్క్ నుంచి నిరసన ర్యాలీ ప్రారంభించి ఈడీ కార్యాలయం వద్ద ముగించనున్నట్లు చెప్పారు. ఈడీ కార్యాలయం వద్ద బైఠాయింపు కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు చెప్పారు. షేర్లను పెంచిన కుంభకోణంలో సెబీ చైర్మన్ మాధవి, ఆమె భర్త ప్రణయ్ ప్రమేయం ఉందని ఆరోపించారు. షేర్లను పెంచినందుకు మాధవి భర్తకు మారిషస్ ని తన కంపెనీలో షేర్లు ఇచ్చారని పేర్కొన్నారు.
షేర్లను ఆక్రమంగా పెంచిన విషయం హిండెన్ బర్గ్ నివేదిక వెల్లడించిందని, దీనిపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) తో విచారణ జరిపించాలని ఎఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ డిమాండ్ చేసినప్పటికీ కేంద్రం పట్టించుకోలేదని ఆయన విమర్శించారు. ఇలాంటి చర్యలతో దేశ ఆర్థిక వ్య వస్త్రపై ప్రభావం పడుతుందని మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com