స్థానిక ఎన్నికలపై కాంగ్రెస్ ప్లాన్ బీ..?

స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి పెద్ద ప్రాబ్లం అయి కూర్చున్నాయి. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం ఇన్ని రోజులు పట్టుబట్టి వెయిట్ చేసింది. కానీ అది సుప్రీంకోర్టులో ఇటు హైకోర్టులో ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు రాలేదు. హైకోర్టు జీవో నెంబర్ 9, 41, 42 మీద మాత్రమే స్టే విధించింది. అయితే కోర్టు ఆర్డర్ కాపీలో పాత పద్ధతిలో ఎన్నికలు నిర్వహించవచ్చు అని తెలిపింది. ఇదే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ప్లాన్ బి కాబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే స్థానిక సంస్థలు ఎన్నికలు చాలా ఆలస్యం అయిపోయాయి. కాబట్టి రిజర్వేషన్ల కోసం వెయిట్ చేస్తే ఇంకా ఆలస్యం అవుతుంది. అప్పుడు ప్రజల నుంచి కూడా వ్యతిరేకత మొదలవుతుంది. పైగా వెయిట్ చేసినా బీసీ రిజర్వేషన్లకు అనుకూలమైన తీర్పు వస్తుందనే నమ్మకం లేదు.
కాబట్టి పాత పద్ధతిలోనే ఎన్నికలకు వెళ్లాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం. రేపో మాపో ఎన్నికల సంఘం పాత పద్ధతిలో నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది. పార్టీ పరంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చి ప్రతిపక్షాలను టార్గెట్ చేయాలని కాంగ్రెస్ ఆలోచిస్తోంది. బీసీ రిజర్వేషన్ల కోసం తాను చేయాల్సింది అంతా చేశామని.. బీ ఆర్ ఎస్, బిజెపి పార్టీలు ఈ విషయంపై మౌనంగా ఉండి అడ్డుకున్నాయంటూ ఆరోపణలు చేసే అవకాశం ఉంది. అప్పుడు ప్రతిపక్షాలను ఇరకాటంలో పెట్టడంతో పాటు ప్రజల నుంచి మద్దతు కూడా లభించే అవకాశాలు ఉన్నాయని కాంగ్రెస్ ప్లాన్ వేస్తోంది. బీఆర్ఎస్ బిజెపి పార్టీలు పార్టీ పరంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చే అవకాశం పెద్దగా కనిపించడం లేదు.
అదే ఇప్పుడు కాంగ్రెస్ కు అస్త్రం కాబోతోంది. అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి అన్ని రకాలుగా అవకాశాలు ఉంటాయి. వాటిని వాడుకొని లోకల్ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు సంపాదించుకుంటే ప్రజల్లో తమ మీద వ్యతిరేకత లేదు అని నిరూపించుకునే అవకాశం ఉంటుంది. పైగా ఇన్ని రోజులు పార్టీ కోసం కష్టపడ్డ కాంగ్రెస్ కార్యకర్తలకు ఈ విధంగా మంచి గిఫ్ట్ ఇచ్చినట్టు అవుతుంది. అందుకే ప్లాన్ బి కోసం సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు ఎమ్మెల్యేలతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. ఇంకోవైపు లీగల్ గా ఎలాంటి ఇబ్బందులు వస్తాయి అనే అంశంపై కూడా చర్చలు జరుపుతున్నారంట. అన్నీ అనుకూలిస్తే నవంబర్ లోపు స్థానిక ఎన్నికలు అయిపోయాయి అవకాశం ఉంది అని తెలుస్తోంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com