Mallikarjun Kharge : కాంగ్రెస్ ను అంతం చేసే కుట్ర : మల్లికార్జున ఖర్గే

దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన జాతీయ నాయకులపై బీజేపీ నాయకత్వం కుట్రలు చేస్తోందని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అన్నారు. కాంగ్రెస్ పార్టీని అంతచేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నాయని ఆరోపించారు. జవహర్ లాల్ నెహ్రూ, సర్దార్ వల్లాభాయ్ పటేల్ పరస్పర భిన్న భావజాలమనే రీతిలో ప్రచారం చేస్తున్నార ని ఆరోపించారు. ఇవాళ గుజరాత్ లో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు సర్దార్ వల్లభాయ్ పటేల్ వజాలానికి వ్యతిరేకమన్నారు. స్వాతంత్య్ర సమరంలో ఏమాత్రం పాలు పంచుకోని వాళ్లు.. ఇప్పుడు పటేల్ వారసులంటూ ప్రకటించుకోవడం హస్యాస్పదమన్నారు. దేశంలో మతపరమైన విభజనలకు బీజేపీ నాయకులు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ 140 ఏళ్లుగా దేశ సేవలో నిమగ్నమై ఉందని చెప్పారు. స్వా తంత్ర్య సమరంలో చురుగ్గా పాల్గొన్నదని, అలాంటి పార్టీకి ప్రస్తుతం దేశంలో వ్యతిరేక పరిస్థితులను సృ ష్టిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీని అంతం చేయాలని చూస్తున్నారని అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్, జవహర్లాల్ నెహ్రూ మధ్య మంచి అనుబంధం ఉండేదని చెప్పారు. ఆ నేతలిద్దరు దేశం కోసం కలిసి కట్టుగా పని చేశారన్నారు. ఆ నాయకులు ఒకరితో మరొకరు వ్యతిరేకంగా ఉండేవారని అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. నెహ్రూ పటేల్ కీలక నిర్ణయాలు తీసుకున్నం: ఉత్తమ్ అహ్మదాబాద్ లో జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో దేశ రాజకీయ, ఆర్థిక అంశాలకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. దేశ వ్యాప్తంగా పార్టీ బలోపేతంపై విస్తృతంగా చర్చించినట్టు తెలిపారు. అయితే తెలంగాణ నేతలకు మాట్లాడే అవకాశం రాలేదని అన్నారు. మధ్య నిత్య ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగేవని, అన్ని విష యాలపై నెహ్రూ ఆయన సలహాలు తీసుకునే వారని చెప్పారు. పటేల్ సౌలభ్యం దృష్టి ఉంచుకుని సీడబ్ల్యూ సీ సమావేశాలు ఆయన ఇంట్లోనే నిర్వహించేవారని అన్నారు. అలాంటి గొప్ప నాయకులపై బీజేపీ, ఆర్ఎ సి ఎస్ కుట్రలు పన్నుతున్నాయని ఆరోపించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com