Allu Arjun : అల్లు అర్జున్ ఆర్మీ వ్యాఖ్యలపై వివాదం.. కేసు పెట్టాలని ఫిర్యాదు

సినీ హీరో అల్లు అర్జున్‌పై గ్రీన్ పీస్ ఎన్విరాన్‌మెంట్ & వాటర్ హార్వెస్టింగ్ ఫౌండేషన్ ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. దేశ రక్షణ బలగాలను అవమానించే విధంగా ఆర్మీ అనే పదానికి అర్ధం లేకుండా చేశారని మండిపడ్డారు. దేశ నియమనిబంధనలు పాటించడం లేదని ఆరోపించారు. ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జవహర్ నగర్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. గ్రీన్ పీస్ ఎన్విరాన్‌మెంట్ అండ్ వాటర్ హార్వెస్టింగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జవహర్‌నగర్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ సైదులు ను కలిసి ఫిర్యాదు చేశారు. అల్లు అర్జున్ తన అభిమానుల పేరును అల్లు అర్జున్ ఆర్మీగా పెట్టారని, దీనిని తీవ్ర స్థాయిలో ఖండిస్తున్నట్లు తెలిపారు. దేశ ఆర్మీ జాతీయ సమగ్రత, జాతీయ భద్రతను అవమానిస్తూ ఆయన విభిన్న వేదికలపై తనకు ఆర్మీ ఉందని ప్రకటించడం దురదృష్టకరమన్నారు. ఆర్మీ అనేది ఫ్యాన్స్ ఉపయోగించని ప్రతిష్టాత్మకమైన పేరు కావున అల్లు అర్జున్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com