Corona Cases In Telangana: తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. ఒకే రోజులో

Corona Cases In Telangana: తెలంగాణలో కరోనా వైరస్... మళ్లీ కలవరం పెడుతోంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాను థర్డ్‌వేవ్ ముప్పు భయపెడుతోంది. పక్కనే మహారాష్ట్ర,కర్ణాటక సరిహద్దులు ఉండడంతో జిల్లా ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అటు అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. కోవిడ్ వ్యాక్సినేషన్, మాస్క్ నిబంధనలపై దృష్టి పెట్టింది. మహారాష్ట్ర థానేలో ఓ వ్యక్తి కొత్త వేరియంట్ లక్షణాలున్నాయన్న ప్రచారంతో మహారాష్ట్ర సరిహద్దులో ఆంక్షలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు
కరోనా థర్డ్ వేవ్ గుబులు రేపుతోంది.. ఒమిక్రాన్ వేరియంట్ ముంచుకొస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది.. కరోనా ప్రభావిత జిల్లాల్లో అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.. మంత్రివర్గ ఉపసంఘం సైతం కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించింది.. క ఈ వేరియంట్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించిన ఆరు జిల్లాల్లో మూడు ఉమ్మడి ఆదిలాబాద్‌లోనే ఉన్నాయి.. ఇవి మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి కనబడుతోంది.
సంగారెడ్డి జిల్లా ముత్తంగి గురుకుల పాఠశాలలో ఒక్కసారిగా విద్యార్థులంతా తీవ్ర అస్వస్థతకు గురవడం కలకలం సృష్టిస్తోంది. 25 మంది విద్యార్థినులు వాంతులు విరోచనాలతో ఇప్పుడు ఆస్పత్రి పాలయ్యారు. కరోనా నెగెటివ్ వచ్చినప్పటికి వారు బాగా నీరసించిపోవడం, అనారోగ్యంతో ఉండడంతో వారిని సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
సోమవారంనాడు ఇదే పాఠశాలలో 42 మంది విద్యార్థులు, ఓ ఉపాధ్యాయురాలు కరోనా బారినపడ్డారు. ఈ గురుకుల పాఠశాలలో 491 మంది విద్యార్థులు, 27 మంది సిబ్బంది ఉన్నారు. నిన్న 261 మంది విద్యార్థులు, 27 మంది సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 43 మందికి కొవిడ్ నిర్ధారణ అయింది. మిగతా వారికి ఇవాళ కొవిడ్ పరీక్షలు నిర్వహించారు. వారికి నెగెటివ్ వచ్చింది. ఐతే.. కరోనా నెగెటివ్ వచ్చిన వారిలో 25 విద్యార్థినులు వాంతులతో ఆస్పత్రి పాలయ్యారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com