కరోనా తెచ్చిన విషాదం.. పెళ్లైన 15 రోజులకే వరుడు..

ఆమె కాళ్ల పారాణి కూడా ఆరలేదు.. కరోనాకి దయా, దాక్షిణ్యం కొంచెం కూడా లేదు. పెళ్లైన 15 రోజులకే భర్తని పోగొట్టుకున్న ఆ అభాగ్యురాలు కన్నీరుమున్నీరవుతోంది. కళ్యాణమొచ్చినా కక్కొచ్చినా ఆగదని ముహూర్తాలు పెట్టుకున్న సమయానికే కొద్ది మంది అతిధుల సమక్షంలో పెళ్లి చేశారు. అంతా బాగానే జరిగిందని అనుకుంటున్న సమయానికి పెళ్లైన కొద్ది రోజులకే నూతన వరుడు, వధువు, అతడి తల్లి కరోనా బారిన పడ్డారు.
నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం జల్లాపల్లికి చెందిన ఓ యువకుడికి 15 రోజుల క్రితమే పెళ్లయింది. పెళ్లైన కొద్ది రోజులకే అతడి తల్లి, భార్యలకు కరోనా సోకింది. వీరంతా ఇంట్లోనే ఉండి చికిత్స పొందుతున్నారు. అయితే యువకుడికి పరిస్థితి విషమించడంతో కుటుంబసభ్యులు అతడిని ఆస్పత్రికి తరలించినా ప్రాణాలు దక్కలేదు. ఊపిరి అందక ప్రాణాలు కోల్పోయాడు. దీంతో పెళ్లైన 15 రోజులకే అతడు ప్రాణాలు కోల్పోవడంతో ఆ ఇంట విషాదం నెలకొంది. ఇక కరోనాతో బాధపడుతున్న అతడి భార్య, తల్లి ప్రస్తుతం కోలుకుంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com