TG : రేపే కౌంటింగ్.. హైదరాబాద్ లోకల్ ఎమ్మెల్సీ విన్నర్ ఎవరు?

హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి బుధవారం జరిగిన పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 8గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించగా, మధ్యాహ్నం 2 గంటల వరకే 78.57 శాతం ఓట్లు పోల్ అయ్యాయని తెలిపారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన రెండు పోలింగ్ కేంద్రాల్లో మొత్తం ఓటర్లు 112 మందిలో 88మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తం 112 ఓటర్లలో ఎక్స్ అఫిషియో మెంబర్ 31 కాగా, అందులో 22 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 81 మంది కార్పొరేటర్లలో 66 మంది ఓటు హక్కు వినియోగించుకు న్నారు. ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు 37.51 శాతం పోలింగ్ నమోదు కాగా, మధ్యాహ్నం 12 గంటల వరకు 77.68 శాతం, మధ్యాహ్నం 2 గంటల వరకు 78.57 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. సాయంత్రం 4 గంటల వరకు 78.57 శాతం నమోదు అయ్యింది.
ఎన్నికల పరిశీల కులు సురేంద్ర మోహన్ రిటర్నింగ్ అధికారితో కలిసి పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలింగ్ సరళిని పరిశీలించారు. పోలింగ్ ముగిసిన అనంతరం బ్యాలెట్ బాక్సులను రిసెప్షన్ కేంద్రానికి బందోబస్తుతో తీసుకువచ్చిన పిదప పరిశీలన చేసి స్ట్రాంగ్ రూంలో భద్రపరిచారు. స్ట్రాంగ్ రూం వద్ద గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసారు. ఈ నెల 25న ఉదయం 8గంటలకు ఓట్ల లెక్కింపు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం లోని పన్వర్ హాల్లో నిర్వహించడం జరుగుతుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com