TG : పోలీసులను ఆశ్రయించిన ప్రేమ జంట

TG : పోలీసులను ఆశ్రయించిన ప్రేమ జంట
X

ప్రేమ వివాహం చేసుకుని రక్షణ కల్పించాలని నూతన వధూవరులు గురువారం బషీరాబాద్ ఎస్సై గఫ్ఫార్ ను ఆశ్రయించారు. బషీరాబాద్ మండలంలోని టాకీ తాండకు చెందిన ఠాకూర్ నాగు బాయ్ (19) అదే మండలంలోని మంతన్ గౌడ్ తండాకు చెందిన జాదవ్ శ్రీకాంత్ (23) ఈ ఇద్దరు కొన్ని ఏళ్ల నుండి ప్రేమించుకున్నారు.వీరి వివాహానికి అమ్మాయి తరఫు వారు అంగీకరించకపోవడంతో గత సోమవారం హైదరాబాదులోని ఓ శివాలయంలో పెళ్లి చేసుకున్నారు. కులాంతర వివాహం చేసుకున్న ప్రేమజంటకు యువతి కుటుంబ సభ్యుల నుంచి ప్రమాదం ఏర్పడకుండా ముందస్తుగా పోలీసులను ఆశ్రయించామన్నారు. ఇద్దరూ మేజర్లు కావడంతో చట్ట ప్రకారం వారి సొంత నిర్ణయం తీసుకునే హక్కు ఉండడంతో పోలీసుల సమక్షంలో వారి పెద్దలను పిలిచి మాట్లాడి వారికి నచ్చచెప్పే ప్రయత్నం చేస్తామని బషీరాబాద్ ఎస్సైగఫ్ఫార్ తెలిపారు.

Tags

Next Story