TG : స్పీకర్ వ్యవహారాల్లో కోర్టుల జోక్యం ఎందుకు.. దానం, కడియం వాదనలు

X
By - Manikanta |27 July 2024 5:30 PM IST
బీఆర్ఎస్ ఎంఎల్ఎలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్ పై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా స్పీకర్ విషయంలో కోర్టులు జోక్యం చేసుకోరాదని దానం, కడియం తరపు న్యాయవాదులు హైకోర్టులో వాదనలు వినిపించారు.
ఈ మేరకు పలు కోర్టుల తీర్పులను లాయర్ మయూర్ రెడ్డి చదివి వినిపించారు. వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణ ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది. కాగా ఈ పిటిషన్ పై గురువారం నాటి విచారణ సందర్భంగా ఎమ్మెల్యేలపై అనర్హతకు సంబంధించి స్పీకర్ నిర్ణయం తర్వాతే కోర్టులకు సమీక్షించే అధికారం ఉంటుందని ఏజీ హైకోర్టుకు నివేదికను ఇప్పటికే ఇచ్చింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com