TG : మూడు నెలల వరకు స్థానిక ఎన్నికలు లేనట్టే! కోర్టు కీలక ఆదేశాలు
తెలంగాణలో బీసీ కులగణనకు సంబంధించి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. 3 నెలల్లో బీసీ కుల గణనను పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. బీసీ కుల గణన చేసి నివేదిక సమర్పించాలని స్పష్టం చేసింది. రాష్ట్రంలో బీసీ కుల గణన చేపట్టాలని ప్రభుత్వాన్ని ఆదేశించాలని బీసీ సంఘం నేత ఎర్ర సత్యనారాయణ 2019లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్ పై పలుమార్లు వాదనలు జరిగాయి. తాజాగా ఈ పిటిషన్ పై మంగళవారం తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి బెంచ్ విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా పిటిషనర్ తరఫున న్యాయవాది నాగుల శ్రీనివాస్ యాదవ్ వాదనలు వినిపించారు. బీసీ కుల గణనపై సుప్రీం కోర్టు ఉత్తర్వులు ఉన్నాయని అన్నారు. అయితే ఈ పిటిషన్ పై గత విచారణ సందర్భంగా ప్రభుత్వ వైఖరి ఏమిటో చెప్పాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో.. దీనిపై ఆదేశాలు వచ్చేవరకు స్థానిక సంస్థలు జరగబోవన్న ప్రచారం జరుగుతోంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com