TG : వరద బాధితులకు నెల జీతం విరాళం ప్రకటించిన కూనంనేని

TG : వరద బాధితులకు నెల జీతం విరాళం ప్రకటించిన కూనంనేని
X

సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావు గొప్ప మనసు చాటుకున్నారు. వరద బాధితుల సహాయార్థం తన నెల జీతాన్ని విరాళంగా ప్రకటించారు. గురువారం సీఎం రేవంత్ రెడ్డితో మర్యాదపూర్వకంగా కలిసి చెక్కును అందించారు. కాగా, రెండు తెలుగు రాష్ట్రాల్లో వరదలు ఎంతటి బీభత్సం సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏపీలోని విజయవాడ, తెలంగాణలోని ఖమ్మం జిల్లాను వరదలు అతలాకుతలం చేశాయి.అనేక మంది నిరాశ్రయులు అయ్యారు. పదుల సంఖ్యలో మృతిచెందారు. లక్షలాది ఎకరాల్లో పంట నష్టం జరిగింది. తీవ్రస్థాయిలో ఆస్తి నష్టం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో సీఎం రిలీఫ్ ఫండ్‌కు భారీగా విరాళాలు అందుతున్నాయి. తాజాగా తాజాగా వరద బాధితుల కోసం సీపీఐ ఎమ్మెల్యే తన నెల జీతాన్ని విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా కూనంనేనికి సీఎం రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. వరద బీభత్సంతో కుదేలైన ప్రజల జీవితాలను మళ్లీ నిలబెట్టడంలో మీ విరాళం ఎంతో కొంత ఉపయోగంగా ఉంటుందని అన్నారు.

Tags

Next Story