మంత్రి అజయ్ వ్యాఖ్యలపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆగ్రహం
X
By - Nagesh Swarna |2 Dec 2020 8:48 PM IST
మంత్రి పువ్వాడ అజయ్ తనపై చేసిన వ్యాఖ్యలను.. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తీవ్రంగా ఖండించారు. తన రాజకీయ చరిత్ర గురించి మాట్లాడే అర్హత అజయ్‌కు లేదన్నారు. ఏ తప్పూ చేయకుంటే మంత్రి నిన్న కారు ఎందుకు ఆపలేదని నారాయణ ప్రశ్నించారు. పొరపాటున ఆ కార్యకర్త కారు కింద పడి ప్రాణాలు కోల్పోతే బాధ్యత ఎవరిదని ప్రశ్నించారు. తప్పు చేశానన్న భావన ఉండబట్టే... మంత్రి అజయ్ తప్పించుకోవాలని చూశారని నారాయణ విమర్శించారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com