Crime: పక్కా ప్లాన్‌తోనే నవీన్ హత్య

నవీన్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పక్కా ప్లాన్ ప్రకారమే నవీన్‌ను హరి హత్య చేసినట్లు పోలీసులు నిర్దారిస్తున్నారు. అబ్దుల్లాపూర్‌మెట్ ప్రాంతంపై పూర్తి అవగాహన ఉండటంతోనే నవీన్ హత్యకు అదే ప్రాంతం ఎంపిక చేసుకున్నట్లు చెబుతున్నారు.
హత్య అనంతరం వరంగల్‌లోని తండ్రి వద్దకు వెళ్లినట్లు చెబుతున్నారు. నవీన్ అదృశ్యంపై అప్పటికే వరుస కాల్స్ వస్తుండటంతో ఈ విషయం తండ్రికి తెలుస్తుందని భావించి హైదరాబాద్‌కు చేరుకున్నాడు. 19న తెల్లవారుజామున 2 గంటలకు ముసారాంబాగ్‌కు చేరుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఇక నవీన్ హత్య గురించి ప్రియురాలికి చెప్పగా లొంగిపొమ్మని సూచించినట్లు పోలీసులు వెల్లడిస్తున్నారు.
అటు నవీన్ హత్యపై నార్కట్ పల్లి పోలీసులు హరిని అనుమానించారు. హరి అక్క, బావను ప్రశ్నించారు పరిస్థితి క్లిష్టంగా మారడటంతో అప్పుడు తండ్రికి విషయం చెప్పినట్లు తెలుస్తోంది. తండ్రి సూచనతో అబ్దుల్లాపూర్ మెట్‌లో లొంగిపోయాడు హరి. అయితే తన కుమారుడు మాత్రమే ఈ హత్య చేసి ఉంటాడని తాను అనుకోవడం లేదంటున్నారు హరి తండ్రి. మరోవైపు లొంగిపోయే ముందు ఫోన్ డేటా డిలీట్ చేశాడు హరి. దీంతో డేటా రికవరీ కోసం ఫోన్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు.
ఇదిలా ఉండగా నవీన్ ప్రియురాలి పాత్రపైనా పోలీసుల విచారణ చేస్తున్నారు. అయితే ఈ విషయంలో తనకేమీ తెలియదని, అనవసరంగా తనను వివాదంలో లాగితే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించినట్లు తెలుస్తోంది. దీంతో ఆమెను సఖి సెంటర్‌కు తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు పోలీసులు. అటు హరిని 8 రోజలు కస్టడీకి తీసుకోకునేందుకు కస్టడీ పిటిషన్‌ను పోలీసులు రెడీ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com