Crime: కన్న కొడుకే కసాయి.. తల్లిని కడతేర్చిన కుమారుడు

వనపర్తి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కన్న కొడుకే తల్లి పట్ల కసాయిగా మారాడు. అల్లారుముద్దుగా పెంచి పెద్దచేసి ఒకింటి వాడిన చేసిన తల్లిని ఏ మాత్రం కనికరం లేకుండా కడతేర్చిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ దారుణం కొత్తకోట మండలంలోని అమడవాకుల గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే రాములు అనే వ్యక్తి కుటుంబం గ్రామంలో నివసిస్తుంది. అయితే తన తల్లి శంకరమ్మ వృద్ధాప్యం కారణంతో గత కొన్ని నెలలుగా నడవలేని స్థితికి చేరుకుంది. దీంతో ఆమెకు సపర్యలు చేయలేక సోమవారం రాత్రి చంపి శవాన్ని ఇంటి ముందు సంపులో వేశాడు. మరుసటి రోజు శంకరమ్మ కనిపించకపోవడంతో గ్రామస్థులు వెతకడంతో శంకరమ్మ మృతదేహం సంపులో లభ్యమైంది. దీంతో కోపోద్రీక్తులైన గ్రామస్థులు రాములు అతని భార్యకు దేహశుద్ధి చేసి పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com