నల్గొండలో జంట హత్యల కలకలం

X
By - Nagesh Swarna |25 Jan 2021 4:30 PM IST
నల్గొండలోని రాంనగర్‌లో డబుల్ మర్డర్‌లు కలకలం రేపుతున్నాయి. ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులను దుండగులు బండరాళ్లతో కొట్టి చంపారు. తీవ్ర రక్తస్రావంతో ఆ ఇద్దరు మృతి చెందారు. స్థానికుల సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతులు ఇరత రాష్ట్రాలకు చెందినవారిగా పోలీసులు గుర్తించారు. హత్య జరిగిన ప్రదేశంలో మద్యం బాటిళ్లను సీజ్ చేశారు. హత్యకు గల కారణాలపై విచారిస్తున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com