Bandi Sanjay: బండి సంజయ్‌కి సీఆర్‌పీసీ నోటీసులు.. ఆ కేసులో ఏ1గా..

Bandi Sanjay: బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్‌కి 41 సీఆర్‌పీసీ కింద నోటీసులు ఇచ్చారు పోలీసులు. తెలంగాణ రాష్ట్ర అవతరణ రోజున జే-కన్వెన్షన్‌లో.. అమరుల యాదిలో ఉద్యమ ఆకాంక్షల సాధన సభ పెట్టారు. ఆ సభలో వేసిన స్కిట్‌పై టీఆర్‌ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన హయత్ నగర్ పోలీసులు.. బండి సంజయ్‌ను ఏ1గా చేర్చారు.
స్కిట్‌లో వాస్తవాలు చెప్పాం తప్ప ఎవరినీ కించపరచలేదన్నారు బండి సంజయ్. తనపై పెట్టిన సెక్షన్లను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. తనను ఇబ్బందులు పెట్టేందుకు, ఇమేజ్ డ్యామేజ్ చేసేందుకు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఈ కేసులో ఇప్పటికే జిట్టా బాలకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయగా.. ఆయన బెయిల్‌పై బయటికొచ్చారు. మరోవైపు ఇదే కేసులో రాణి రుద్రమదేవి, దరువు ఎల్లయ్యను అరెస్ట్ చేశారు హయత్‌నగర్ పోలీసులు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com