Harish Rao : పథకాల్లో కోతలు.. ఉద్యోగులకు వాతలు : హరీశ్ రావు

రాష్ట్రవ్యాప్తంగా 16వేలకుపైగా ఉన్న హోంగార్డులకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ జీతాలు చెల్లించకపోవడం సిగ్గుచేటని మాజీ మంత్రి హరీ శ్రరావు విమర్శించారు. చిన్న వేతనాలపైనే ఆధార పడి జీవిస్తున్న హోంగార్డులు.. చేతిలో చిల్లిగవ్వలేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. 'ఇంటి అద్దెలు, పిల్లలు స్కూల్ ఫీజులు, రోజువారీ ఖర్చుల కోసం అప్పులు చె య్యాల్సిన దుస్థితి. ఈఎంఐలు చెల్లించకపోవడం వల్ల బ్యాంకు అధికారులు ఫోన్లు చేసి నిలదీస్తున్న పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రతి నెలా ఇదే తీరు కొనసాగుతున్నా పట్టించుకునే వారే లేరు. మాటలు కోటలు దాటితే, చేతలు గడప దాటని ముఖ్యమంత్రి... హోంగార్డుల కు ఏం సమాధానం చెబుతారు? 'పథకాల్లో కోతలు, జీతాలు చెల్లించకుండా ఉద్యోగులకు వాతలు. ఇది ప్రజా పాలన కాదు.. ప్రజా వ్యతిరేక పాలన హోం గార్డులకు తక్షణమే వేతనాలు చెల్లించాలి' అని డిమాండ్ చేశారు.
సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టులను పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ పాదయాత్ర చేయాలని హరీష్ రావు నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై ఇప్పటికే బీఆర్ఎస్ శ్రేణులతో చర్చించిన హరీష్ రావు.. ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకున్నారు. సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టుల నిర్దేశిత ఆయకట్టు ప్రాంతాల్లో వారం రోజుల పాటు.. దాదాపు 130 కిలోమీటర్ల దూరం హరీష్ రావు పాదయాత్ర చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ పాదయాత్రలో భాగంగా.. గ్రామాల్లో రోజుకో సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అలాగే ఈ పాదయాత్ర ముగింపు రోజు భారీ సభను ఏర్పాటు చేయాలని నిర్ణయించగా.. ఈ సభకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరు కానున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ పాదయాత్ర పై హరీశ్ రావు, బీఆర్ఎస్ పార్టీ అధికారిక ప్రకటన విడుదల చేయాల్సి ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com