Cyber Crime in Karimnagar : కరీంనగర్‌లో సైబర్ క్రైమ్ క్రిమినల్స్!

కరీంనగర్‌లో ముంబై పోలీసుల సోదాలు నిర్వహించడం చర్చనీయంగా మారింది. ఈ సోదాల్లో భాగంగా సైబర్ క్రైమ్ నేరగాళ్ళు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముంబైలోని ఈస్ట్ రీజియన్ సైబర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ కేసు నమోదు అయింది. అయితే మందాని ఇంపాడ్ పూర్ వెల్ఫేర్ ట్రస్ట్ పేరిట కరీంనగర్ లోని ఓ బ్యాంకులో ఖాతా ప్రారంభించారు. ఏడుగురు సభ్యులు ఒకే ఖాతాను తెరిచిన వీరు ఆర్థిక లావాదేవీలు జరిపినట్టుగా తెలుస్తోంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ముంబై సైబర్ క్రైం పోలీసులు కరీంనగర్ చేరుకుని ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారించగా.. సుభాష్ నగర్ కు చెందిన ఫరూక్ అహ్మద్ (40) అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. మిగతా ఇద్దరిని వదిలేసిన సైబర్ సెల్ పోలీసులు మిగతావారి కోసం గాలిస్తున్నారు. ఈ వ్యవహారంలో ఓ మహిళ కూడా ఉన్నట్లు సమాచారం. మరి కొందరు పరారీలో ఉన్నారు. వీరు అకౌంట్ ఓపెన్ చేసిన బ్యాంకు నుండి కూడా పూర్తి వివరాలు రాబట్టే అవకాశాలు ఉన్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com