కడియం, దానంకు క్లీన్ చిట్.. అంతా అనుకున్నట్టుగానే..!

ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిలకు బిగ్ రిలీఫ్ దక్కింది. వారిద్దరూ బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలే అంటూ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సంచలన తీర్పు ఇచ్చారు. దీంతో పది మంది ఎమ్మెల్యేలు బయటపడ్డారు. అయితే ఇదంతా ముందు నుంచే ఊహించినట్టు జరిగిపోయింది. వీరందరికీ క్లీన్ చిట్ ఇస్తారని బీఆర్ ఎస్ ముందు నుంచే చెబుతోంది. గులాబీ నేతలు చెప్పినట్టుగానే పది మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చారు. కానీ దానం నాగేందర్ విషయంలోనే చాలా రకాల అనుమానాలు ఉండేవి. ఎందుకంటే ఆయన ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెల్ మీద పోటీ చేశారు. ఒక పార్టీలో ఉంటూ మర పార్టీ టికెట్ మీద ఎలా పోటీ చేస్తారు అనే వాదనలు ఎన్నో రకాలుగా వినిపించాయి. మొదట్లో దానం మీద వేటు తప్పదు అంటూ ప్రచారం జరిగింది.
కానీ కేసు విచారణ జరుగుతున్న క్రమంలో.. ఆయనపై వేటు పడదు అని అర్థం అయిపోయింది. ఎందుకంటే దానం పదే పదే తాను కాంగ్రెస్ లో చేరలేదని చెప్పుకొచ్చారు. బీఆర్ ఎస్ ఎమ్మెల్యేను అన్నారు. తన నియోజకవర్గంలో ఉప ఎన్నిక రాదు అంటూ హింట్ ఇస్తూ వచ్చారు. చివరకు అదే జరిగింది. అటు కడియం శ్రీహరి కూడా తాను కాంగ్రెస్ లో చేరలేదని.. బీఆర్ ఎస్ పార్టీలోనే ఉన్నానంటూ చెప్పడం విడ్డూరం. ఏదేమైనా బీఆర్ ఎస్ ఇన్ని రోజులు చేసిన పోరాటానికి అనుకున్న ఫలితం మాత్రం దక్కలేదు.
కానీ బీఆర్ ఎస్ నేతలు మాత్రం ఈ పది మందిని ఏదో ఒక రకంగా ఇరకాటంలో పెట్టాలనే చూస్తున్నారు. పార్టీ లైన్ దాటితే ఎలాంటి పరిణామాలు ఉంటాయనేది వీరి విషయంలో అందరికీ అర్థం అయ్యే విధంగా చెప్పాలనుకున్నారు గులాబీ బాస్. అందుకే ఇన్ని రోజులు ఈ పది మంది ఎమ్మెల్యేలను ఇరకాటంలో పెట్టారు. మరి వీరి విషయంలో జరిగింది చూసి మిగతా పార్టీల ఎమ్మెల్యేలు ఎవరైనా పార్టీ మారేందుకు సాహసం చేస్తారా.. లేదంటే లైట్ తీసుకుని జంపింగ్ లు కంటిన్యూ చేస్తారా అన్నది చూడాలి.
Tags
- Danam Nagender Disqualification Case
- Kadiyam Srihari MLA Issue
- BRS MLAs Clean Chit
- Telangana Speaker Gaddam Prasad Kumar Decision
- BRS vs Congress Telangana Politics
- Telangana MLA Disqualification Case
- Party Switching Telangana MLAs
- BRS Political Strategy
- Telangana Assembly Speaker Verdict
- Danam Nagender Congress Ticket Controversy
- Telangana News
- Latest Telugu News
- TV5 News
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
