TG : అసెంబ్లీలో దానం నాగేందర్ తీవ్ర వ్యాఖ్యలు

TG : అసెంబ్లీలో దానం నాగేందర్ తీవ్ర వ్యాఖ్యలు
X

శాసనసభలో బీఆర్ఎస్ పై కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బయట తిరగనివ్వను అంటూ పరుష పదజాలం వాడారు. శుక్రవారం హైదరాబాద్‌ అభివృధ్ధిపై సభలో స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ చర్చను ప్రారంభించిన దానం బీఆర్ఎస్పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో సభలో ఆ పార్టీ సభ్యులు నిరసనకు దిగారు. పోడియం వైపు దూసుక రాగా.. ప్రతిగా దానం కూడా పోడియం వైపు వెళ్​లారు. కాంగ్రెస్‌ సభ్యులు దానంను వెనక్కి తీసుకెళ్లారు. ఆ తర్వాత దానం వ్యాఖ్యలను నిరసిస్తూ బీఆర్ఎస్ సభ్​యులు సభ నుంచి వాకౌట్ చేశారు.

ఐ యామ్ సారీ : దానం

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలను ఎంఐఎం శాసనసభాపక్ష నేత దానం నాగేందర్ తప్పుబట్టారు. ఈ క్రమంలో స్పందించిన దానం.. తన వ్యాఖ్యలు బాధించి ఉంటే సారీ అని చెప్పారు. తెలంగాణలో ఈ పదజాలం సాధారణంగా వాడతారని చెప్పారు. బీఆర్ఎస్ నేతలు రెచ్చగొట్టడం వల్లే అలా మాట్లాడాల్సి వచ్చిందని తెలిపారు. కాగా దానం నాగేందర్‌ చేసిన వ్యాఖ్యల్లో అన్‌పార్లమెంటరీ వ్యాఖ్యలు ఉంటే రికార్డుల నుంచి తొలగిస్తామని స్పీకర్‌ ప్రసాద్‌ కుమార్‌ ప్రకటించారు.

Tags

Next Story