TG : ఆడవాళ్లతో పెట్టుకుంటే కౌశిక్ రెడ్డికి బట్టలు కూడా మిగలవు.. దానం కామెంట్

TG : ఆడవాళ్లతో పెట్టుకుంటే కౌశిక్ రెడ్డికి బట్టలు కూడా మిగలవు.. దానం కామెంట్
X

తెలంగాణలో గాంధీ-కౌశిక్ రెడ్డి రేపిన రచ్చ, పొలిటికల్ హీట్ కొనసాగుతోంది. ఎమ్మెల్యే దానం నాగేందర్ తగ్గేదేలేదంటూ కౌంటర్ ఇస్తున్నారు. బీఆర్ఎస్ నేతలు మీటింగ్ పెట్టుకునేందుకు కేవలం గాంధీ ఇల్లే దొరికిందా అని ప్రశ్నించారు. ఆడవాళ్ల శక్తి చూపిస్తే... ఒంటిమీద ఏమీ ఉండవని కౌశిక్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చారు దానం నాగేందర్. కౌశిక్ రెడ్డి దమ్ము ఎంతో మాకు తెలుసన్నారు. అరికెపూడి గాంధీ ఇంటికి వచ్చిన ఆయన... బీఆర్ఎస్ నేతలకు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారన్నారు ఎమ్మెల్యే దానం నాగేందర్.

ఆడవాళ్లను ఇన్ వాల్వ్ చేస్తూ మాట్లాడిన కేటీఆర్, కౌశిక్ రెడ్డి కామెంట్స్ తోనే రచ్చ మొదలైంది. ఇదే క్రమంలో దానం నాగేందర్ కూడా రెచ్చిపోయి కౌశిక్ రెడ్డిపై కౌంటరిచ్చారు.

Tags

Next Story