TG : యువతితో డేటింగ్...చీటింగ్..శంషాబాద్ ఎయిర్ పోర్టులో యువకుడి అరెస్ట్

TG : యువతితో డేటింగ్...చీటింగ్..శంషాబాద్ ఎయిర్ పోర్టులో యువకుడి అరెస్ట్
X

ఓ యువతితో డేటింగ్ చేసి అపై చీటింగ్ చేసిన నిందితుడిని శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఎస్ఆర్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే... అమీర్పేట్ కు చెందిన యువతిని బెంగుళూరులోని కామన్ ఫ్రెండ్స్ మీటింగులో కలిసిన శశాంక్ పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా లోబరుచుకున్నాడు. ఉన్నత చదువుల కోసం యూకే వెళుతున్నానని, తిరిగి వచ్చాక పెళ్లి చేసుకుంటానని ఆ యువతిని నమ్మించాడు. ఈక్రమంలో యూకే వెళ్లిన శశాంక్ ఆ యువతిని దూరం పెట్టడంతో పాటు ఆమె సోషల్ మీడియా అకౌంట్లను బ్లాక్ చేశాడు. శశాంక్ తనను మోసిం చేసినట్లు గ్రహించిన బాధిత యువతి 2023 డిసెంబర్ ఎస్ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

యువతి ఫిర్యాదు మేరకు విదేశాలకు వెళ్లిన శశాంక్ పై ఎస్ ఆర్ నగర్ పోలీసులు లుక్ ఔట్ నోటీసులు జారీ చేశారు. కాగా యూకే నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు శశాంక్ వస్తున్నాడని ఇమిగ్రేషన్ అధికారులు సమాచారం అందించడంతో, ఎయిర్ పోర్టులో పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.

Tags

Next Story