Telangana News: డీలిమిటేషన్ పై కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ..!

డీలిమిటేషన్ పై ఎంత రచ్చ జరుగుతుందో అందరికీ కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి.. ఇక్కడ ఆ పార్టీ వాయిస్ కు ఎక్కువ ప్రియారిటీ దక్కుతోంది. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని.. దాన్ని కచ్చితంగా వ్యతిరేకించాలని కోరుతున్నారు. బీజేపీ తాను పరిపాలిస్తున్న రాష్ట్రాలకు మేలు చేసి.. ఎప్పటికీ అధికారంలో ఉండేలా కుట్రలు చేస్తోందంటున్నారు. ఆర్థిక రాజధానులుగా ఉన్న దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తే సహించేది లేదంటున్నారు. అటు బీజేపీ కూడా తీవ్ర స్థాయిలో మండిపడుతోంది. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ తో పాటు ఇతర ఎంపీలు కూడా సీఎం రేవంత్ వ్యాఖ్యలపై ఫైర్ అవుతున్నారు. తాము జనాభా ప్రాతిపదికన చేస్తేనే సౌత్ స్టేట్స్ కు అన్యాయం జరుగుతుందని.. కానీ ఇప్పుడున్న సీట్ల సంఖ్యను బట్టి ఆయా రాష్ట్రాల్లో 50 శాతం పెంచుతున్నట్టు చెబుతున్నారు.
దాని వల్ల సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్నట్టు సౌత్ రాష్ట్రాలకు అన్యాయం జరిగే పరిస్థితి లేదని చెబుతున్నారు. కానీ ఇదే విషయంపై రెండు పార్టీల నేతలు.. వాదోపవాదనలు చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్నట్టు తెలంగాణలో డీలిమిటేషన్ మీద రచ్చ నడుస్తోంది. అటు బీఆర్ ఎస్ మాత్రం ఆచితూచి వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తోంది. కానీ కాంగ్రెస్, బీజేపీ మధ్య సాగుతున్న పోరు పీక్ స్థాయికి వెళ్లిపోతోంది.
సీఎం రేవంత్ కు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారుని.. డీలిమిటేషన్ ద్వారా ప్రజలకు మరింత సులభంగా సేవలు అందుతాయని బీజేపీ అంటోంది. ఈ రెండు పార్టీలు కూడా ఢిల్లీ అధిష్టానం ఆదేశాల మేరకు బలంగానే వాదిస్తున్నాయి. రేపు పార్లమెంట్ లో బిల్లును పాస్ చేయించుకునేందుకు కేంద్రం రెడీ అయింది. విపక్షాల మద్దతు లేకపోయినా బిల్లును పాస్ చేయించుకుంటే.. బీజేపీకి తిరుగుండదని చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
