TG : హుజూర్ నగర్ లో కూల్చివేతలు.. స్థానికుల ఆర్తనాదాలు

తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సొంత నియోజకవర్గం సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో కూల్చివేతలు కలకలం రేపాయి. ఓ సెలూన్ షాప్‌ను కూల్చివేయడంతో బాధితుడి ఆవేదన పలువురిని కంటతడి పెట్టించింది. ప్లీజ్ నా మంగలి షాప్ కూల్చకండి సార్.. బతుకు తెరువుపై కొట్టొద్దని వేడుకున్నారు. జేసీబీకి అడ్డంగా పడుకొని నిరసన తెలిపాడు. అయినా అధికారులు షాప్‌ను నేలమట్టం చేశారు. చేతి వృత్తిదారులపై అధికారులు ప్రతాపం చూపిస్తుండటంతో బాధితులు లబోదిబోమంటున్నారు. మా పొట్ట కొట్టొద్దని వేడుకుంటున్నారు. మరోవైపు కూల్చి వేతలపై అన్ని వర్గాల ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పెద్దలను వదిలి రోడ్డు పక్కన పని చేసుకునే సామాన్యులపై మీ ప్రతాపమా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో వైరల్ గా మారింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com