TG : 23 ప్రాంతాల్లో కూల్చివేతలు.. 111.71 ఎకరాల భూమిని స్వాధీనం

జూన్ 27 నుంచి 262 ఆక్రమణలు తొలగించినట్లు హైడ్రా ప్రకటించింది. 23 ప్రాంతాల్లో మొత్తం 111.71 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నట్లు ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. అత్యధికంగా అమీన్‌పూర్‌లో 51 ఎకరాలు, మాదాపూర్ సున్నం చెరువు పరిధిలో 10 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని సంరక్షించినట్లు వెల్లడించింది. కాగా కమిషనర్ రంగనాథ్ ఆధ్వర్యంలో HMDA పరిధిలో ఆక్రమణల కూల్చివేతలు ముమ్మరంగా సాగుతున్నాయి.
హైడ్రా విషయంలో తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. హైడ్రాకు ప్రత్యేకంగా పోలీసు సిబ్బందిని కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. 15 మంది సీఐ స్థాయి, 8 మంది ఎస్‌ఐ స్థాయి పోలీసు అధికారులను కేటాయించింది. ఈ మేరకు డిప్యుటేషన్‌పై ఆదేశాలు ఇస్తూ డీజీపీ కార్యాలయం మంగళవారం ఉత్తర్వులు ఇచ్చింది. హైడ్రాకు కమిషనర్ గా సీనియర్ ఐపీఎస్ అధికారి రంగనాథ్ ఉన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com