Hydra : కావూరి హిల్స్ లో కూల్చివేతలు
శేరిలింగంపల్లి జోనల్ పరిధి లోని మాదాపూర్ పై హైడ్రా ఫోకస్ పెట్టింది. సోమవారం యాక్షన్ ప్లాన్ స్టార్ట్ చేసింది. ఉదయమే ప్రొక్లెయినర్లతో మాదాపూర్ చేరుకున్న అధికారులు ముందుగా కావూరి హిల్స్లోని పార్క్ స్థలంలోని అక్రమ నిర్మాణాలను ఒక్కొక్క టిగా తొలగించారు. ఇక్కడ పార్క్ స్థలంలో స్పోర్ట్స్ అకాడమీ నిర్మించి కొందరు వ్యాపారం సాగిస్తున్నారు.
పార్క్ లో షెడ్లు వేయడంపై అక్కడున్న స్థానికులు మొదట్లో కొందరు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వెంటనే వాటిని తొలగించాలని జీహెచ్ఎంసీకి ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదు. ఇటీ క వలే స్థానికులు విషయాన్ని హైడ్రా దృష్టి తీసుకెళ్లగా, సోమవారం అధికారులు రంగంలోకి దిగి నిర్మించిన షెడ్లను కూల్చేసి కావూరి హిల్స్ పార్క్ పేరిట నేమ్ బోర్డును ఏర్పాటు చేశారు. ప్రభుత్వ స్థలాలను ఎవరు అక్రమించినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.
పార్క్ స్థలాన్ని తాము 25 ఏళ్లకు గాను లీజుకు తీసుకున్నామని స్పోర్ట్స్ అకాడమీ నిర్వాహకులు పేర్కొన్నారు. గడువు ముగియక ముందే అన్యాయంగా తమ నిర్మాణాలను తొలగించారని వారు ఆరోపించారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com