TG : రైతులందరితో చర్చించాకే రైతు భరోసా : భట్టి విక్రమార్క

రైతులందరితో చర్చించి వారి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే రైతు భరోసాను అమలు చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి రైతుకు న్యాయం చేస్తామన్నారు. రైతు భరోసాపై ఆదిలాబాద్ జిల్లా రైతులతో అభిప్రాయ సేకరణ కార్యక్రమం గురువారం జరగగా.. భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క హాజరయ్యారు.
ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. అందరి అభిప్రాయాలు తీసుకోవాలనే సదుద్దేశంతో ఉన్నామని చెప్పారు. రైతుకి సాయం అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. గత ప్రభుత్వం తరహాలో నాలుగు గోడల మధ్యనే నిర్ణయాలు తాము తీసుకోమరు.
ప్రతి పైసా పేదలకు అందాలనేది తమ లక్ష్యమన్నారు. సన్నకారు రైతుల పథకాల రూపకల్పనకు ప్రభుత్వం ఆలోచిస్తోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. పథకాలపై ప్రజల్లో చర్చించి అమలు చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఆయన చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com