Deputy CM : డిప్యూటీ సీఎం భట్టి ఇంట్లో తీవ్ర విషాదం

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) ఇంట విషాదం నెలకొంది. ఆయన సోదరుడు వెంకటేశ్వర్లు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న వెంకటేశ్వర్లు హైదరాబాద్ లోని AIG ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. సోదరుడి మరణవార్త తెలియగానే తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. వెంటనే వైరాకు బయలుదేరారు. హోమియో ఎండి చదివిన మల్లు వెంకటేశ్వర్లు ఆయుష్ శాఖలో ప్రొఫెసర్‌గా, అడిషనల్ డైరెక్టర్‌గా పనిచేసి ఉద్యోగ విరమణ పొందారు. వెంకటేశ్వర్లు అంత్యక్రియలు ఇవాళ సాయంత్రం వైరాలో జరగనున్నాయి. మరోవైపు ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టులోని ప్రధాన బ్యారేజీ మేడిగడ్డ పర్యటనకు సీఎం, మంత్రులు వెళ్లనున్నారు. సోదరుడి మరణంతో ఈ పర్యటనకు భట్టి దూరంగా ఉండనున్నారు.
సీఎం రేవంత్ రెడ్డి (cm revanth reddy), మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి మంగళవారం కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ బరాజ్‌ను సందర్శించనున్నారు. మంగళవారం ఉదయం 10 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తర్వాత సభ వాయిదా పడుతుంది. అనంతరం 10:15 గంటలకు ప్రత్యేక బస్సుల్లో అసెంబ్లీ నుంచి బయల్దేరుతారు. భువనగిరి, జనగామ, హనుమకొండ మీదుగా జయశంకర్భూపాలపల్లి జిల్లా అంబట్పల్లిలోని మేడిగడ్డ బ్యారేజీకి మధ్యాహ్నం 3 గంటలకు చేరుకుంటారు. మేడిగడ్డలో దెబ్బతిన్న ఏడో బ్లాక్లోని పిల్లర్లతో పాటు మొత్తం బ్యారేజీని పరిశీలిస్తారు
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com