TG : వాస్తవాలు చెబితే.. తప్పు పడుతున్నారు : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

TG : వాస్తవాలు చెబితే.. తప్పు పడుతున్నారు : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
X

పాలన పరంగా రాష్ట్రాన్ని బీఆ ర్ఎస్ పార్టీ నాశనం చేసిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫైర్అయ్యారు. మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణలో ఆర్థిక సంక్షోభాన్ని సృ ష్టించారని విమర్శించారు. గాంధీభవన్లో టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడుతూ.. మేడిగడ్డ కూలిందని వాస్తవాలు చెప్పిన కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ నేతలు తప్పుపడుతున్నరు. హరీశ్ రావు, సంతోష్ రావులు కాళేశ్వరం ప్రాజెక్టులో దోచు కున్నరు. అందుకే కేసీఆర్ రెండో సారి తన కేబి నెట్ లో హరీశ్ రావును అవకాశం ఇవ్వలేదు. రాష్ట్రంలో పాలన, ఆర్థిక పరంగా మనం గాడిన పెడుతున్నం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం.. దాదాపు రూ. లక్ష కోట్లు సంక్షేమ కోసం ఖర్చు చేసింది. ఎన్నికల ముందు రాహుల్ గాంధీ కుల గణన చేస్తామన్నరు. ఆ ఇచ్చిన హామీ మేరకు రా ష్ట్రంలో కుల గణన చేసి చూపించాం. స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ల కోసం బిల్లులు తీసుకొని వచ్చాం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం.. రిజర్వేషన్లకు ముకుతాడు వేసింది. ఎల్లంప ల్లి, నెట్టెంపాడు, శ్రీశైలం, నాగార్జున సాగర్, దేవాదుల ప్రాజెక్టులు మనమే నిర్మించాం. బీఆ ర్ఎస్ పాలనలో కాళేశ్వరంతో నీళ్లు ఇయ్యలేక పోయారు' అని అన్నారు.

Tags

Next Story