Bhoomata Portal : ధరణి ఔట్.. భూమాత ఇన్.. కొత్త శకం ప్రారంభం

ధరణి రద్దుపై తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న పలు అంశాలకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. కొత్త రేషన్ కార్డుల జారీకి సంబంధించిన విధి విధానాలపై మంత్రిమండలి కీలక నిర్ణయం తీసుకుంది. ధరణి పోర్టల్ స్థానంలో భూమాత పోర్టల్ తీసుకువస్తూ నిర్ణయం తీసుకుంది. ధరణి స్థానంలో కొత్తగా భూమాత పేరుతో
సేవలు అందుబాటులోకి తీసుకోవాలని కేబినెట్ నిర్ణయించింది. ఇందుకోసం కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది.
ఎటువంటి వివాదాలు లేని అద్భుత రెవెన్యూ చట్టం దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ చట్టం దేశానికే తలమానికంగా ఉండాలని పలు రాష్ట్రాల రెవెన్యూ విధానాలను పరిశీలిన చేస్తోంది. పలు రాష్ట్రాలలో రెవెన్యూ కోడ్ అమలు తీరుతెన్నులను అధ్యయనం చేయనుందని తెలుస్తోంది. ధరణి దిద్దుబాటు చర్యల్లో భాగంగా పలు ప్రణాళికలను పరిశీలిస్తున్నది. అదేవిధంగా ఉత్తర ప్రదేశ్లో అమలవుతున్న భూములకు సంబంధించిన సింగిల్ తాను క ూడా పరిశీలన చేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయా రాష్ట్రాలల్లో పర్యటించి అక్కడ అమలవుతున్న చట్టాలను, ఆర్వోఆర్ ను, సాఫ్ట్ వేర్ ను క్షుణ్నంగా పరిశీలిస్తారు.
ఏయే రాష్ట్రాల్లో ఏయే అంశాలు ప్రామాణికంగా ఉన్నాయో వాటిని క్రోడీకరించి అత్యంత ఉన్నత ప్రమాణాలతో కూడిన కొత్త చట్టంతో పాటు సాఫ్ట్ వేర్, ఆర్వోఆర్లను తీసుకొచ్చేందుకు మరింత సమయం పడుతుందని ఉన్నతాధికారులు అభిప్రాయ పడుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com