TG : సీఎంతో అభిప్రాయ భేదాలు నిజమే.. కొత్త పార్టీపై రాజగోపాల్ రెడ్డి క్లారిటీ..

సీఎం రేవంత్ రెడ్డికి పక్కలో బల్లెంలా తయారైన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సొంతంగా పార్టీ పెట్టబోతున్నారనే వార్తలు కాంగ్రెస్ పార్టీ లో కలకలం రేపాయి. మంత్రి పదవి ఆశించి భంగపడ్డ రాజగోపాల్ రెడ్డి సొంత పార్టీ పై పలు రకాలుగా విమర్శలు చేస్తూ తరుచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవలే 25 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో రాజగోపాల్ రెడ్డి భేటీ కావడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. అయితే వీటిపై తాజాగా వివరణ ఇచ్చారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.
ఈ వార్తలను ఖండించిన ఆయన.. తాను పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో రహస్యంగా సమావేశమయ్యానంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేశారు. కొంతమంది ఎమ్మెల్యేలు తనను మామూలుగానే కలిశారని.. దానిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని వివరణ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డితో అభిప్రాయ భేదాలు ఉన్న మాట నిజమే అయినప్పటికీ.. పార్టీకి నష్టం కలిగించే పనులు తాను చేయనని స్పష్టం చేశారు. బీజేపీ నేత ఈటెల రాజేందర్‌తో కలిసి రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీబెట్టబోతున్నారనీ.. అందుకే ఎమ్మెల్యే లతో భేటీ అయ్యారనే వార్తలు నెట్టింట షికార్లు చేస్తున్నాయి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com