Dil Raju : ఐటీ విచారణకు దిల్ రాజు

Dil Raju : ఐటీ విచారణకు దిల్ రాజు
X

ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఐటీ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. ఇటీవల ఆయన కార్యాలయంతో పాటు నివాసాల్లో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో వ్యాపారాలకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని నోటీసులు జారీ చేశారు. ఇటీవల దిల్ రాజు నివాసంలో నాలుగు రోజుల పాటు ఐటీ అధికారులు ముమ్మరంగా తనిఖీలు చేశారు. దిల్ రాజు ఆర్థిక లావాదేవీల వివరాలు, బ్యాంక్ లాకర్లు, ఆఫీసుల్లో సోదాలు నిర్వహించారు ఐటీ అధికారులు. అలాగే.. ఈ సంక్రాంతి పండక్కి దిల్ రాజు ప్రొడ్యూస్ చేసిన సినిమాల బడ్జెట్ వివరాలను ఇన్ కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ సోదాలు చేశారు. ఈ దాడుల సమయంలో గుర్తించిన కొన్ని కీలక డాక్యుమెంట్లు, ఆర్థికపరమైన లావాదేవీల గురించి ప్రశ్నించడానికి తాజాగా తమ కార్యాలయానికి పిలిపించుకున్నారు ఐటీ అధికారులు. దిల్ రాజు, ఆయన కుటుంబ సభ్యులకు చెందిన స్థిర- చరాస్తుల క్రయవిక్రయాలపై నిర్వహించిన పంచనామా గురించి ఆరా తీయనున్నారు.

Tags

Next Story