TG : ఈ అన్నం పిల్లలు తింటారా.. హాస్టల్‌లో ఎమ్మెల్యే కోమటిరెడ్డి కేకలు

TG : ఈ అన్నం పిల్లలు తింటారా.. హాస్టల్‌లో ఎమ్మెల్యే కోమటిరెడ్డి కేకలు
X

    నల్గొండ జిల్లా మునుగోడులోని మహాత్మా జ్యోతిబాపూలే బీసీ బాలికల గురుకుల వసతి గృహాలను మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని మెస్ చార్జీలు పెంచినప్పటికీ భోజనంలో నాణ్యత లేదంటూ ఏజెన్సీ నిర్వాహకులపై రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వండిన అన్నం, కూరలను పరిశీలించారు. అన్నం, కూరలు, సాంబారు, పెరుగు నాసిరకంగా ఉన్నాయంటూ అధికారులపై మండిపడ్డారు. ఈ అన్నం పిల్లలు తింటారా నాణ్యమైన భోజనం అందించకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. మరోసారి హాస్టల్‌ను ఆకస్మికంగా తనిఖీ చేస్తానన్నారు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి.

    Tags

    Next Story