TG : లక్ష్మీదేవి బొమ్మ ఉన్న పటాకులు కాల్చొద్దు.. రాజాసింగ్ పిలుపు

TG : లక్ష్మీదేవి బొమ్మ ఉన్న పటాకులు కాల్చొద్దు.. రాజాసింగ్ పిలుపు
X

పటాకులు కాల్చడంలో పద్ధతులు పాటించాలని కోరారు గోషామహల్ ఎమ్మెల్యే, బీజేపీ నేత రాజాసింగ్. లక్ష్మీ దేవిని కొలిచే దీపావళి రోజు అమ్మవారి బొమ్మతో ఉండే ఏ పటాకాను కాల్చవద్దన్నారు రాజాసింగ్. ఎన్నో ఏళ్లుగా లక్ష్మీదేవి ఫోటోతో పటాకాలు కాల్చుతున్నారని, ఈసారి సంకల్పం తీసుకుని వాటిని కొనకుండా ఉండాలని సూచించారు. వచ్చే ఏడాది నుంచైనా అలాంటి టపాకులు తయారు చేయకుండా ఉంటారన్నారు. ప్రజలంతా సంతోషంగా పండుగ జరుపుకోవాలన్నారు.

Tags

Next Story