TG : కరెంటు చార్జీలు పెంచొద్దు : కేటీఆర్

TG : కరెంటు చార్జీలు పెంచొద్దు : కేటీఆర్
X

కరెంట్ చార్జీల పెంపు ప్రతిపాదనలను తిరస్కరించాలని విద్యుత్ రెగ్యులేటరీ కౌన్సిల్ ని బీఆర్‌ఎస్ వర్కింగ్‌ ప్రెసిడెంట్ కేటీఆర్ కోరారు. రాష్ట్ర ప్రభుత్వం వివిధ పేర్లు చెప్పి 18,500 కోట్ల రూపాయల విద్యుత్ భారాన్ని ప్రజలపై మోపేందుకు సిద్ధమైందని కేటీఆర్ విమర్శించారు. ఇంత భారీగా ప్రజల పైన విద్యుత్ భారాన్ని మోపడం దారుణమన్నారు. ఇప్పటికే ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల వ్యవసాయ రంగం మొదలుకొని పారిశ్రామిక రంగం వరకు అన్ని సంక్షోభంలో కూరుకుపోయాయని కేటీఆర్ మండిపడ్డారు. గృహ వినియోగదారులకు సైతం స్థిర చార్జీల పేరుతో విద్యుత్ భారం వేసేలా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందని కేటీఆర్ ఆరోపించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రతిపాదనలను తిరస్కరించాలని కోరుతూ పార్టీ నేతలతో కలిసి కేటీఆర్ వినతి పత్రం సమర్పించారు.

Tags

Next Story