TG : పదవి ఇచ్చినప్పుడు కులం గుర్తుకు రాలె..? : మహేశ్ కుమార్ గౌడ్

కాంగ్రెస్ పదవి అనుభవించిన ప్పుడు మహేశ్వర్ రెడ్డికి రాహుల్ గాంధీ కులం, మతం గుర్తుకు రాలేదా అని పీసీపీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. రాహుల్గాంధీపై బీజేఎల్పీ నేత మహేశ్వర్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై పీసీసీ చీఫ్ ఫైన్అయ్యాడు. ఇవాళ గాంధీభ వన్లో ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు.. బీజేఎల్పీ పదవి ఎప్పుడూ ఉడుతదో తెలియక మహేశ్వర్రెడ్డి తికమకగా మాట్లాడుతున్నా రని అన్నారు. ‘ 2015లో రాహుల్ గాంధీని పిలిచి నిర్మల్ లో పాదయాత్ర చేసినప్పుడు మహేశ్వర్ రెడ్డి కి రాహుల్ గాంధీ ఏ కులమో తెలియదా..? ఇప్పుడు రాహుల్ గాంధీ ది ఏ కులం అడుగుతుండు. జాతి మొత్తం అభిమా నించే నాయకుడు రాహుల్ గాంధీ. భారతదేశ కులం రాహుల్ గాంధీ కులం ఒక్కటే. బీసీ అయిన బండి సంజయ్ ని స్టేట్ ప్రెసిడెంట్ గా తొలగించి ఓసీకి అప్పగించారు. మీరు కూడా కాంగ్రెస్ పార్టీ మీద విమర్శులు చేయడం హా స్యాస్పదం. బీసీలకు మీ పార్టీ చేసిందీ ఏమీ లేదు. మహేశ్వర్ రెడ్డి కులగణన గురించి మా ట్లాడుతున్నాడు. దమ్ముంటే ప్రధాని మోడీని 2025 లో జరిగే జనగణనలో ఓబీసీల అంశం కూడా చేర్చాలని చెప్పండి. అప్పుడు తెలుస్తది రాహుల్ గాంధీ ఏ కులం అనేది. దేశంలో, రా ష్టంలో బలహీన వర్గాలకు న్యాయం చేయాలనే తపన కాంగ్రెస్ పార్టీకి ఉంది.' అని మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com