KTR : ఇందిరమ్మ రాజ్యం అంటే రేషన్ బియ్యం ఎగ్గొట్టుడేనా? : కేటీఆర్ ట్వీట్

కొండనాలికకు మందేస్తే ఉన్న నాలిక ఊడింది అన్నట్టు సన్నబియ్యం కోసం చూస్తే దొడ్డుబియ్యం కూడా ఇయ్యలే అని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. గురుకులాల్లో విద్యా ర్థులకు బుక్కెడు బువ్వ పెట్టని కాంగ్రెస్ సర్కార్.. సామాన్యులకు రేషన్ బియ్యం అందించడంలో నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు. 'మార్చి నుంచి సన్నబియ్యం ఇస్తామన్న ప్రభుత్వం పదో తేదీ దాటినా రేషన్ బియ్యం ఇవ్వలేదు. లక్ష 54 వేల మెట్రిక్ టన్నులకు గాను రేషన్ దుకాణా లకు కేవలం 62 వేల మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా చేసి చేతులు దులుపుకుంది. కొత్త ఏడాది ఉగాదికి సన్నబియ్యం అని సన్నాయి నొక్కులు నొక్కి ఉన్న బియ్యం ఊడబీకింది. ప్ర జాపాలన అంటే పస్తులేనా? ఇందిరమ్మ రాజ్యం అంటే రేషన్ బియ్యం ఎగ్గొట్టుడేనా? రైతులకు రుణమాఫీ, రైతుభరోసా, ఆడబిడ్డలకు కేసీఆర్ కిట్, గర్భవతులకు న్యూట్రిషన్ కిట్, విద్యార్థి నులకు హెల్త్ కిట్, ఎలక్ట్రిక్ స్కూటీ, మహిళ లకు నెలకు రూ.2500 మహాలక్ష్మి, ఆఖరికి పేదలకు రేషన్ బియ్యం కట్ . కాంగ్రెస్ అంటే కటింగ్.. కన్నింగ్' అంటూ ట్విట్టర్ వేదికగా సెటైర్ వేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com