Kishan Reddy : ఆ భూమిని వేలం వేయొద్దు.. సీఎం రేవంత్ కు కిషన్ రెడ్డి లేఖ

Kishan Reddy : ఆ భూమిని వేలం వేయొద్దు.. సీఎం రేవంత్ కు కిషన్ రెడ్డి లేఖ
X

గచ్చిబౌలిలో 400 ఎకరాల ప్రభుత్వ భూమి వేలం ప్రక్రియను వెంటనే నిలి పివేయాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఇవాళ సీఎం రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి బహిరంగ లేఖను రాశారు. ఆ భూమికి పక్కనే హెచ్‌సీయూ ఉందని, విద్యా ర్థులకు, పర్యావరణ ప్రేమికులకు ఈ నిర్ణయం ఆమోదయోగ్యం కాదన్నారు. ' మానవ ఆర్థిక వనరుల పేరుతో పర్యావరణానికి పెద్ద ఎత్తు న్న ముప్పు చేకూరే అవకాశం ఉంది. గతంలో మీరు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ప్రభుత్వ భూముల అమ్మకానికి వ్యతిరేకంగా మాట్లాడా రు. ఇప్పుడు మీరే దగ్గరుండి వేలం వేయిస్తు న్నారు. ఈ భూమి ఫారెస్ట్ పరిధిలోకి రానప్పటి కీ దాని చుట్టూ పచ్చని చెట్లతో, వైవిధ్యమైన జీవజాతులతో నిండి ఉన్నాయి. ప్రభుత్వం 400 ఎకరాల భూమిని, దానిని ఆనుకుని ఉన్న 800 ఎకరాల భూమిని కలిపి జాతీయ ఉద్యానవనంగా ప్రకటించాలి. భవిష్యత్తు తరాల కోసం ఈ స్థలాలను రక్షించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ' అని కిషన్ రెడ్డి అన్నారు. ఇదిలా ఉంటే ప్రభుత్వం వేలానికి నోటిఫికేషన్ ఇచ్చిన భూమి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉంది. అది పూర్తిగా అటవీ సంపద, జింకలు, నెమళ్లు, వేలాది పక్షులు ఉన్నాయని వాటిని పరిరక్షించే అవసరం ఉందని, యూనివర్సిటీలోని విద్యార్థి సంఘాలు ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టాయి. ఇదే క్రమంలో బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో సైతం ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Tags

Next Story