Musi Victims : మా ఇండ్లు కూల్చొద్దు.. హైకోర్టు ఆశ్రయించిన మూసీ బాధితులు

మూసీ రివర్ బెడ్ బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. తమ ఇళ్లు, కట్టడాలపై అధికారులు మార్కింగ్ చేయటంతో బాధితులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఎక్కడ తమ ఇళ్లను యంత్రాంగం కూలగొడుతుందోనని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అధికారులు తమ ఇళ్లపై మార్కింగ్ వేసిన విషయాన్ని వీరంతా హైకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. మూసీ సుందరీకరణ కోసం ప్రభుత్వం మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మూసీ రివర్‌బెడ్‌లో ఉన్న ఇళ్ల కూల్చివేతను అధికారులు ఇప్పటికే ప్రారంభించారు. అయితే తమ ఇళ్లు కూల్చకుండా ఆదేశాలివ్వాలని పిటిషన్‌లో కోరారు. దశాబ్దాలుగా ఈ ఇళ్లలోనే తాము నివాసం ఉంటున్నామని, ఇప్పుడు అవి కూలగొడితే తమ పరిస్థితి ఏంటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో మూసీ రివర్ బెడ్ పిటిషన్లపై నేడు ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టనుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com