Venkaiah Naidu : మాతృభాషకు దూరం చేయవద్దు: వెంకయ్యనాయుడు

ఇంటర్ విద్యార్థులకు ద్వితీయ భాషగా సంస్కృతం ఉంచాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసి తాను బాధపడినట్లు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. మార్కుల దృష్ట్యా సంస్కృతం ఉంచాలని చూస్తుంటే మాత్రం, ఈ నిర్ణయంపై పునరాలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు. సంస్కృతం తప్పు కాదని, అమ్మ భాష(తెలుగు)కు విద్యార్థులను దూరం చేయడం సరికాదన్నారు. జాతీయ విద్యావిధానం సైతం మాతృభాషకు ప్రాధాన్యత ఇచ్చిందని గుర్తుచేశారు.
"విద్యార్థులను మన మాతృభాషకు దూరం చేయడం మంచిది కాదు. సంస్కృతాన్ని బోధించడంలో తప్పులేదు. అదే సమయంలో మన సంస్కృతిని అందిపుచ్చుకునే దిశగా అమ్మ భాష ఆలంబనగా నిలుస్తుంది. అందుకే జాతీయ విద్యా విధానం-2020 కూడా దానికి ప్రాధాన్యత ఇచ్చింది. ఈ స్ఫూర్తిని అందిపుచ్చుకుని, విద్యార్థులను మాతృభాషకు మరింత చేరువ చేసే దిశగా తెలంగాణ సర్కార్ చర్యలు తీసుకోవాలని ఆకాంక్షిస్తున్నాను" అని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com