Karimnagar : ఆ సార్ మాకొద్దు.. పాఠశాల ముందు గ్రామస్థుల ధర్నా

విద్యార్థులను చితకబాదుతున్న ఉపాధ్యాయుడిని తక్షణమే పాఠశాల నుంచి పంపించి వేయాలని పిల్లల తల్లిదండ్రులు పాఠశాల ముందు ధర్నా చేశారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం మైలారం గ్రామంలో ఇవాళ చోటుచేసుకుంది. ఆరు నెలల క్రితం తమ గ్రామానికి బదిలీపై వచ్చిన ఉపాధ్యాయుడు రామ్ రాజయ్య పిల్లలకు పాఠాలు చెప్పకుండా నిద్రపోతాడ ని, అడిగితే ఇష్టమొచ్చినట్లు విద్యార్థులను కొడుతాడని పిల్లల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. మధ్యాహ్న భోజన సిబ్బందిని, అటెండరు, చివరకు ప్రధానోపాధ్యాయుడిని కూడా బెదిరిస్తున్నట్లు ఆరోపించారు. రామ్ రాజయ్య తరగతి గదిలో నిద్రపోయే ఫోటోలు, టేబుల్ పై కాళ్లు పెట్టి పడుకున్న ఫోటోలు గ్రా మస్తులు మీడియాకు చూపించారు. ప్రధానో పాధ్యాయుడు జి. శ్రీనివాస్ ను వివరణ కోరగా రామ్ రాజయ్య తనకు వాట్సప్ లో రివాల్వర్ ఫోటో, రివాల్వర్ కావాలని కోరుతూ అధికారులకు పెట్టుకున్న దరఖాస్తును పంపినట్లు తెలిపారు. ఇక ఉపాధ్యాయుడు రామ్ రాజ య్యను వివరణ కోరగా విద్యార్థుల తల్లిదండ్రు లు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. స్కూళ్లో ఇతర ఉపాధ్యాయులు, సిబ్బంది తప్పు లను ప్రశ్నించినందుకే తనపై కక్షగట్టారని చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com