Sajjanar Fires : వ్యూస్ కోసం ప్రాణాలకు తెగించొద్దు. బైకర్ పై సజ్జనార్ ఫైర్

సోషల్ మీడియాలో లైక్, వ్యూవ్స్ కోసం కొందరు యువకులు చేస్తున్న పిచ్చి పనులపై తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి పిచ్చి పనులు చేస్తూ సమాజానికి ఏం నేర్పిస్తున్నారని ప్రశ్నిస్తూ సజ్జనార్ ఓ వీడియోను షేర్ చేశారు. సోషల్ మీడియాలో లైక్స్ కోసం వ్యూవ్స్ కోసం యువత ప్రాణాల మీదకు తెచ్చుకుంటు న్నారని, ప్రమాదకర స్థాయిలో రీల్స్ చేస్తూ కొందరు ప్రాణాలు సైతం పోగొట్టుకుంటున్నారన్నారు. తాజాగా ఓ యువకుడు ప్రమాదకర స్టంట్ చేస్తూ ఛాలెంజ్ విసరగా ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో బైక్ నడుపుతున్న వ్యక్తి 5 లీటర్ల పెట్రోల్ బాటిల్ తీసుకుని రెండు చేతులు వదిలేసి డబ్బా మూత తీసి ట్యాంక్ లో పెట్రోల్ పోశాడు. బైక్ 40 స్పీడ్ వెళుతున్నట్టు చూపించాడు.
ఈ స్టంట్ చేసింది కూడా సింగిల్ రోడ్ పైనే...ఏమాత్రం తేడా వచ్చిందంటే ప్రాణాలు గాలిలో కలిసిపోవాల్సిందే. దీంతో వీడియోను ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఇవేం పిచ్చి పనులు అంటూ మండిపడ్డారు. సోషల్ మీడియా ఎలాంటి కంటెంట్ చేస్తున్నారో ఆలోచించకుండా దిక్కుమాలిన వీడియోలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రమాదకర వీడియోలతో ఏం సందేశం ఇస్తున్నారు.. సమాజానికి ఏం నేర్పిస్తున్నారు. ఆలోచించండి అంటూ మండిపడ్డారు. దీంతో ఆ యువకుడిని అరెస్ట్ చేయాలి అంటూ నెటిజన్లు వరుసగా కామెంట్లు పెట్టారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com