డ్రగ్స్ టెస్టు సవాళ్లు.. తెలంగాణలో హాట్ పాలిటిక్స్..

తెలంగాణలో డ్రగ్స్ కేసు రాజకీయాలను వేడెక్కిస్తోంది. మొయినాబాద్ లో బీఆర్ ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ మీద నమోదైన రెండు తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తున్నాయి. పుట్టా మహేష్ కుమార్ బ్లడ్ టెస్ట్ రిపోర్టులు ఇంకా రాలేదు. అయితే రోహిత్ రెడ్డికి పాజిటివ్ రావడంతో డ్రగ్ టెస్టు సవాళ్లు పెరుగుతున్నాయి. కేటీఆర్ డ్రగ్స్ టెస్టుకు రావాలంటూ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సవాల్ చేశారు. దానిపై కేటీఆర్ కూడా స్పందించారు. తాను ఎలాంటి డ్రగ్స్ టెస్టుకు ఎప్పుడైనా రెడీ అన్నారు. తాను డ్రగ్స కు పూర్తి వ్యతిరేకం అని.. ప్రజాప్రతినిధులు అందరూ డ్రగ్స్ టెస్టుకు ముందుకు రావాలని కేటీఆర్ చెప్పారు. ప్రజల తరఫున ఉన్న ప్రతినిధులు తమ నిజాయితీని నిరూపించుకోవాలని కేటీఆర్ అన్నారు. దీంతో అసెంబ్లీ సమావేశాల్లో ఇదే హాట్ టాపిక్ అవుతోంది.
అటు కాంగ్రెస్ నేతలు తాము ఎప్పుడంటే అప్పుడే డ్రగ్స్ టెస్టుకు రెడీ అంటున్నారు. బీఆర్ ఎస్ హయాంలోనే డ్రగ్స్ వాడకం తెలంగాణలో పెరిగిందని.. దీనికి కేటీఆర్ తలదించుకోవాలన్నారు మహేష్ గౌడ్. దీనిపై కేటీఆర్ కూడా సీరియస్ గానే స్పందించారు. ప్రతి సారి డ్రగ్స్ కేసులు వచ్చినప్పుడల్లా తన పేరును ప్రస్తావిస్తే ఊరుకునేది లేదని.. లీగల్ నోటీసులతో సమాధానం చెబుతానన్నారు. కేటీఆర్ పై అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ భగ్గుమంటున్నాయి. రెండు పార్టీలు మూకుమ్మడిగా బీఆర్ ఎస్ ను తీవ్రంగా విమర్శిస్తున్నాయి.
అసెంబ్లీ వేదికగా డ్రగ్స్ చుట్టూ మరింత వాదనలు జరిగేలాగే కనిపిస్తున్నాయి. బీఆర్ ఎస్ మొన్నటి దాకా చాలా విషయాలపై ప్రశ్నించాలని చూస్తోంది. కానీ సడెన్ గా డ్రగ్స్ వైపు రాజకీయాలు పెరిగిపోతున్నాయి. దీంతో బీఆర్ ఎస్ ప్లాన్ బెడిసికొడుతుందని అంటున్నారు. మరి బీఆర్ ఎస్ ఈ బడ్జెట్ సమావేశాల్లో డ్రగ్స్ ను ఎలా ఓవర్ కమ్ చేసి తమ ప్లాన్ నెగ్గించుకుంటుందనేది వేచి చూడాల్సిందే. అటు కాంగ్రెస్ దీనిపై ఎలాంటి ప్లాన్ తో ముందుకు వెళ్తుందో.. బీజేపీ ఎలాంటి స్టాండ్ తీసుకుంటుందో మరికొద్ది సేపట్లో తేలిపోతుంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
