DSC Final Key Released : డీఎస్సీ ఫైనల్ కీ విడుదల .. తొందరలోనే ఫలితాలు

తెలంగాణలో టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహించిన డీఎస్సీ ఆన్‌లైన్ పరీక్షల ఫైనల్ కీ విడుదలైంది. ఆగస్టు 13న ప్రిలిమినరీ కీ విడుదల చేయగా.. దానిపై వచ్చిన అభ్యంతరాలను పరిశీలించిన పాఠశాల విద్యాశాఖ అధికారులు శుక్రవారం ఫైనల్ కీ విడుదల చేశారు. డీఎస్సీ ఫైనల్ కీ నిస్కూల్ అసిస్టెంట్, లాంగ్వేజ్ పండిట్, సెకెండరీ గ్రేడ్ టీచర్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులకు సంబంధించి వేర్వేరుగా అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. తుది కీ ప్రకారం అభ్యర్థులు ఎవరికి వారు తమకు పరీక్షల్లో వచ్చిన మార్కులను తెలుసుకోవచ్చు. అతి త్వరలోనే ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి జులై 18 నుంచి ఆగస్టు 5వరకు డీఎస్సీ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షలకు 2,45,263 మంది హాజరయ్యారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com