దుబ్బాక ఉపఎన్నిక..టీఆర్‌ఎస్ టికెట్ ఆశిస్తున్న ఆయనకు కాంగ్రెస్ ఆఫర్

దుబ్బాక ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్ధి ఎవరనేదానిపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. నర్సారెడ్డి పేరు దాదాపు ఖారారు చేసింది తెలంగాణ పీసీసీ. అయితే చివరి నిమిషంలో మార్పులు చేర్పులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. టీఆర్‌ఎస్ టికెట్ ఆశిస్తోన్న చెరుకు శ్రీనివాస్‌రెడ్డికి కాంగ్రెస్ ఆఫర్ ఇచ్చింది. టికెట్ ఇస్తాం... పోటీ చేయాలంటూ... శ్రీనివాస్‌రెడ్డితో మంతనాలు జరుపుతున్నారు కాంగ్రెస్ నేతలు. దీంతో ఎటూ తేల్చుకోలేకపోతున్నారు చెరుకు శ్రీనివాస్‌రెడ్డి.
ఇప్పటికే నర్సారెడ్డి పేరును దాదాపు ఖారారు చేసింది కాంగ్రెస్ అధిష్టానం. కానీ చివరి క్షణంలో మార్పులు చోటు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. తాజాగా చెరుకు శ్రీనివాస్‌రెడ్డి పేరు తెరపైకి రావడంతో... టికెట్ ఎవరికి ఇస్తారన్న ఉత్కంఠ కొనసాగుతోంది. మరోవైపు... గాంధీభవన్‌లో ఉమ్మడి మెదక్ జిల్లా కాంగ్రెస్ ముఖ్యనేతలతో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి మాణిక్యం భేటీ అయ్యారు. దీంతో నర్సారెడ్డి హుటాహుటిన గాంధీభవన్‌కు చేరుకున్నారు. టీఆర్‌ఎస్, బీజేపీ ఇంకా అభ్యర్థులను ప్రకటించని నేపథ్యంలో...కాంగ్రెస్ సైతం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఆ రెండు పార్టీలు తమతమ అభ్యర్ధులను ప్రకటించిన తర్వాతనే... తమ అభ్యర్ధి ఎవరనేది ప్రకటిస్తామంంటున్నారు కాంగ్రెస్ నేతలు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com