దుబ్బాకలో మారుతున్న రాజకీయ పరిణామాలు

దుబ్బాక అసెంబ్లీ ఉపఎన్నికతో.. రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. టీఆర్‌ఎస్ పార్టీలో చేరికలు జోరందుకున్నాయి. అసంతృప్తులు పార్టీలు మారుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ముద్దుల నాగేశ్వర్‌రెడ్డి.. టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. హైదరాబాద్‌లోని టీఆర్‌ఎస్ భవన్‌లో మంత్రి హరీష్‌రావు సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికలో ముద్దుల నాగేశ్వర్‌రెడ్డి కాంగ్రెస్ నుంచి పోటీ చేసి రెండోస్థానంలో నిలిచారు. ఈసారి టిక్కెట్ దక్కకపోవడంతో కారెక్కారు. దుబ్బాకలో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయిందని మంత్రి హరీష్‌రావు అన్నారు. గతంలో ఏం చేశారని.. కాంగ్రెస్ నేతలు ఓట్లు అడుగుతున్నారని హరీష్‌రావు ప్రశ్నించారు.కనీసం తాగునీరు కూడా ఇవ్వలేదని అన్నారు. ఫార్మాసిటీని అడ్డుకుంటామని కాంగ్రెస్ నేతలు అంటున్నారని ఆయన ఎదురుదాడి చేశారు. హుజూర్‌నగర్‌లో చెల్లని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట దుబ్బాకలో చెల్లుతుందా అని హరీష్‌రావు ఎద్దేవ చేశారు. మీ పార్టీ నేతలు ఎందుకు పార్టీ వీడుతున్నారో ఆత్మవిమర్శ చేసుకోవాలని హరీష్‌రావు హితవు పలికారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com