Dussehra : దసరా ఎఫెక్ట్... బస్టాండ్లన్నీ ఫుల్ రష్

బతుకమ్మ, దసరా పండుగకి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో ప్రధాన బస్టాండ్లన్నీ...కిటకిటలాడుతున్నాయి. M.G.B.S, J.B.S బస్టాండ్లు ప్రయాణికులతో కిక్కిరిశాయి. సికింద్రాబాద్, కాచిగూడ రైల్వేస్టేషన్లుజనంతో నిండిపోయాయి. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు ఇబ్బంది తలెత్తకుండా దక్షిణ మధ్య రైల్వే 2వేలకు పైగా ప్రత్యేక రైళ్లను, టీజీఎస్ఆర్టీసీ 7వేల 754 ప్రత్యేక బస్సులను నడిపిస్తుంది. ఐనా అవి ఏమాత్రం సరిపోవడం లేదని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.
హైదరాబాద్ -విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ పెరిగింది. దసరా పండుగకు సొంతూళ్లకు వెళ్లే వారితో ఒక్కసారిగా వాహనాల రద్దీ పెరిగింది. దీంతో ఆర్టీసీ బస్సులు, కార్లు, ఇతర వాహనాలు నెమ్మదిగా కదిలాయి. ఆర్టీసీ బస్సులతో పాటు బస్టాండ్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. వాహనాలు ఒకదాని వెంట ఒకటి వరుస కట్టాయి. చౌటుప్పల్, పెద్దకాపర్తి, చిట్యాల ఫ్లైఓవర్ నిర్మాణాలు వద్ద వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. వాహనాల రద్దీని పోలీసులు క్రమబద్ధీకరిస్తున్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com