Earth Sciences University : తెలంగాణలో ఎర్త్‌సైన్స్ యూనివర్సిటీ.. ఎక్కడంటే?

తెలంగాణలో కొత్తగా ఎర్త్‌సైన్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొత్తగూడెంలోని మైనింగ్ కాలేజీని ఎర్త్‌సైన్స్ వర్సిటీగా అప్‌గ్రేడ్ చేయనుంది. వారం రోజుల్లో దీనికి సంబంధించి ఉత్తర్వులు విడుదల కానున్నాయి. వర్సిటీ ఏర్పాటుకు రూ.500 కోట్ల నిధులతో పాటు 100 పోస్టులు అవసరమని ఉన్నత విద్యామండలి అధికారులు ప్రభుత్వానికి ఇప్పటికే నివేదిక ఇచ్చినట్లు సమాచారం.
చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయానికి యూజీసీ గుర్తింపు లభించింది. దీంతో విద్యార్థినుల సర్టిఫికెట్స్‌పై అధికారికంగా వర్సిటీ ముద్ర పడనుంది. అంతే కాకుండా వర్సిటీలో PhD చేయాలనుకునే విద్యార్థులకు మార్గం సుగమమైంది. అధికారులు సైతం త్వరలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. విశ్వవిద్యాలయ గుర్తింపు లేకపోవడంతో ఇంతకాలం ఉస్మానియా వర్సిటీ పేరుతో సర్టిఫికెట్స్ వచ్చేవి.
SC, ST, BC, మైనారిటీ, EBC విద్యార్థుల బోధన ఫీజులు, స్కాలర్‌షిప్ దరఖాస్తు గడువును మే 31 వరకు పొడిగించినట్లు అధికారులు తెలిపారు. 11.88 లక్షల మంది విద్యార్థులకు గాను ఇప్పటివరకు 10.34 లక్షల మంది అప్లై చేసుకున్నారని తెలిపారు. MBBS, PG మెడికల్ ప్రవేశాలు పూర్తి కాకపోవడం, ఇంకా విద్యార్థుల వివరాలు అందకపోవడంతో గడువును పొడిగించారు. అటు కాలేజీల యాజమాన్యాల రిజిస్ట్రేషన్‌కూ మే 31 వరకు గడువు ఇచ్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com