BRS : బీఆర్ఎస్ విలీనం వార్తలపై ఈటల ఆగ్రహం

BRS : బీఆర్ఎస్ విలీనం వార్తలపై ఈటల ఆగ్రహం
X

బీజేపీలో బీఆర్ఎస్ విలీనమనేది శుద్ధ అబద్ధమని బీజేపీ సీనియర్ నేత, ఎంపీ ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు ఇందుకు సంబంధించిన కనీస ప్రస్తావన కూడా బీజేపీలో జరగలేదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు కుట్రపన్ని బీజేపీపై పిచ్చిపిచ్చి విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.

రాష్ట్రంలో బీజేపీ గ్రాఫ్ పడిపోయిందని విమర్శిస్తున్నారని, కానీ బీజేపీ గ్రాఫ్ తెలంగాణలో రోజురోజుకూ పెరుగుతుందే తప్ప పడిపోలేదని స్పష్టం చేశారు ఈటల. సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న తప్పుల చిట్టా పద్దులను సిద్ధం చేస్తున్నామన్నారు. బీజేపీలో బీఆర్ ఎస్ విలీనం పెద్ద అబద్ధమని, ఇదంతా తప్పుడు ప్రచారమని తేల్చి చెప్పారు. హైడ్రా పేరుతో రాష్ట్ర ప్రభుత్వ హైడ్రామా చేస్తోందని, కట్టిన ఇళ్లను ఎందుకు కూల్చి వేస్తున్నారని ప్రశ్నించారు.

చెరువు పరీవాహంలో భూములున్న వారికి ప్రత్యామ్న్యాయ భూములు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈటల. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన రుణమాఫీ పెద్ద బోగస్ అని విమర్శించారు.

Tags

Next Story