TG : కేటీఆర్‌తో పాటు మరో ఇద్దరికి ఈడీ నోటీసులు?

TG : కేటీఆర్‌తో పాటు మరో ఇద్దరికి ఈడీ నోటీసులు?
X

ఫార్మూలా -ఈ రేసు కేసులో ఈడీ ఎంట్రీ ఇవ్వడంతో అనూహ్యంగా పరిణామాలు మారిపోతున్నాయి. ఏసీబీ ఇచ్చిన వివరాలతో మనీ ల్యాండరింగ్ కేసు నమోదు చేసిన ఈడీ.. కేటీఆర్ తో పాటు మరో ఇద్దరికి నోటీసులు ఇవ్వనుందని తెలుస్తోంది. ఈడీ అధికారులు కేటీఆర్ నివాసానికి వెళ్లి నోటీసులు ఇస్తారని సమాచారం. మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం కేటీఆర్, ఐఏఎస్ ఆర్వింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి పై కేసులు నమోదయ్యాయి. హైకోర్టులో కేటీఆర్ కు 10 రోజుల రిలీఫ్ దక్కడంతో సంబరాలు చేసుకున్న బీఆర్ఎస్ కేడర్.. ఈడీ కేసులో కలవరపడుతున్నారు. నిన్న కవిత.. నేడు కేటీఆర్.. ఏం జరగబోతుందో అని ఉత్కంఠ అనుభవిస్తున్నారు. ఈడీ కేసులోనూ కేటీఆర్ హైకోర్టుకు వెళ్లనున్నారని సమాచారం.

Tags

Next Story